Home  »  TV News  »  Brahmamudi : కావ్యతో కలిసి చలపతి ఇంటికి చేరిన రాజు!

Updated : Jul 16, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1085 లో..... ఇందుని హాస్పిటల్ నుంచి వెళ్ళమని చలపతి చెప్తాడు. నా బావని నా ఇంటికి తీసుకొని వెళ్లి తనని కాపాడుకుంటానని ఇందు రిక్వెస్ట్ చేస్తుంది. చలపతి ఒప్పుకోకపోవడంతో ఇందు అతని కాళ్లపై పడి బ్రతిమిలాడుతుంది. దాంతో చలపతి సరే అంటాడు.ఆ తర్వాత రాజు స్పృహలోకి వచ్చాడని డాక్టర్ చెప్పగానే ముగ్గురు లోపలికి వెళ్తారు. నాన్న ఆక్సిడెంట్ చేసిన వాడు దొరికాడా డబ్బులు ఇవ్వమను అంటుంటే ఇందు నవ్వుకుంటుంది. అప్పుడే ఇందుకి అపర్ణ ఫోన్ చేసి రాజు ఎక్కడ అని అడుగుతుంది.

ఇప్పుడు బావ దగ్గరే ఉన్నాను వచ్చాక చెప్తానని ఇందు అంటుంది. బావ ఏంటని రాజు అనగానే భర్తని బావ అనొచ్చని ఇందు అనగానే అవునని చలపతి అంటాడు. మరొకవైపు రేఖ రెడీ అవుతుంటే ఎక్కడికి అని భ్రమరాంబ అడుగుతుంది. ఆ రాజు గాడు చచ్చాడు కదా వాళ్ళ ఇంటికి అని రేఖ అంటుంది. ఎందుకు వాడిని చంపించేసావని భ్రమరాంబ అడుగగానే వాడు నా గతం అని చెప్పబోయి ఆగిపోతుంది. వాడు మనం చేసే ప్రతీ పనికి అడ్డుపడుతున్నాడని రేఖ అంటుంది కానీ భ్రమరాంబకు డౌట్ వస్తుంది. ఆ తర్వాత రేఖ, భ్రమరాంబ కిందకి వస్తారు. స్వాతి అపర్ణ సరదాగా మాట్లాడుకుంటుంటే ఇంకా వాళ్ళకి విషయం తెలియనట్లు ఉందని రేఖ, భ్రమరాంబ అనుకుంటారు. ఇందు ఎక్కడ అని రేఖ అంటుంది. రాజు దగ్గర ఉందని అపర్ణ అనగానే రేఖ షాక్ అవుతుంది. అయితే మీకు విషయం తెలియదా అని భ్రమరాంబ అనగానే రేఖ తనని బయటకి లాక్కొని వెళ్తుంది. నువ్వు వాడిని చంపించేసానన్నావ్ మరి వాళ్ళు ఏంటి అలా అంటున్నారని భ్రమరాంబ అడుగుతుంది.

దాంతో రేఖ రౌడీకి ఫోన్ చేసి ఏమైందని అడుగుతుంది. చంపేసానని చెప్తాడు. అది విని రేఖ రిలాక్స్ అవుతుంది. మరొకవైపు చలపతి ఇంటికి రాజు, కావ్య వెళ్తారు. మీ అత్తగారి ఇంటికి వెళ్ళమంటే వెళ్లకుండా ఇక్కడికి వచ్చావ్ ఏంట్రా అని చలపతి అంటాడు. అప్పుడే ఇందు వాటర్ తీసుకొని వస్తుంది. అప్పుడేమో మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావ్.. ఇప్పుడెమో వెళ్ళనని బెట్టు చేస్తున్నావని చలపతి అంటాడు. భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలని చలపతి, లక్ష్మి వాళ్ళకి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.